IPL 2019, openers Sunil Narine and Chris Lynn tore the Rajasthan Royals bowling attack to shreds to help Kolkata Knight Riders notch up an easy eight-wicket win at Sawai Mansingh Stadium in Jaipur on Sunday.
#IPL2019
#KolkataKnightRiders
#RajasthanRoyals
#SunilNarine
#ChrisLynn
#dineshkarthik
#RobinUthappa
#cricket
సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జోరు కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో జైపూర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు క్రిస్‌లిన్ , సునీల్ నరైన్ దూకుడుగా ఆడటంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. తొలుత స్టీవ్‌స్మిత్ అర్ధశతకం సాధించడంతో 3 వికెట్ల నష్టానికి రాజస్థాన్ 139 పరుగులు చేయగా.. ఛేదనలో తొలి వికెట్‌కి 8.3 ఓవర్లలోనే 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన లిన్, నరైన్ జోడీ కోల్‌కతా విజయానికి బాటలు వేసింది. అయితే.. ఓవర్ వ్యవధిలో ఈ ఇద్దరూ పెవిలియన్ చేరగా.. అనంతరం వచ్చిన రాబిన్ ఉతప్ప దూకుడుగా ఆడి గెలుపు లాంఛనాన్ని 13.5 ఓవర్లలోనే 140/2తో పూర్తి చేశాడు. కోల్‌కతా బౌలర్లలో స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ ఒక్కడే రెండు వికెట్లతో ఫర్వాలేదనిపించాడు.